తాజ్ హోటల్‌కు నానో కారులో వచ్చిన రతన్ టాటా

Telugu Lo Computer
0


టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా నానో కారులో ఏ బాడీ గార్డ్ సాయం లేకుండా తాజ్ హోటల్ కు రావడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన వచ్చిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఆయనకు హోటల్ స్టాఫ్ రక్షణ కవచలంలా నిలబడి లోపలికి తీసుకెళ్లారు. ఆయన సింప్లిసిటీని చూసి సోషల్ మీడియా అంతా పొగడ్తలతో ముంచెత్తుతూ పర్సనల్‌గా ఆయన చాలా సింపుల్ అంటూ కాంప్లిమెంట్ ఇస్తున్నారు. గత నెలలో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నానో కార్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మెసేజ్ ఇచ్చారు. "నన్ను నిజంగా ప్రేరేపించినది, అలాంటి వాహనాన్ని తయారు చేయాలనే కోరికను రేకెత్తించింది. నిరంతరం భారతీయ కుటుంబాలను స్కూటర్‌లపై చూడటం, బహుశా తల్లి, తండ్రి మధ్య పిల్లవాడు ఎక్కడికి వెళుతున్నారో అక్కడకు వెళ్లడం, తరచుగా జారే రోడ్లపై ప్రయాణించడం చూసే కాబోలు" అని అందులో పేర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)