కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అర్ధ నగ్నంగా నటి నిరసన

Telugu Lo Computer
0


ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. రెడ్ కార్పెట్‌పై ఉక్రెయిన్ కు చెందిన ఓ నటి వినూత్నంగా నిరసన తెలిపింది. ఉక్రెయిన్ లో మహిళలు, యువతులపై రష్యా సైనికుల అఘాయిత్యాలను ఆపండి అంటూ ఆమె అర్ధనగ్నంగా నిరసన చేసింది. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన సిబ్బంది ఆమెను చుట్టుముట్టి బయటకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై నటీమణులు వాక్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ కు చెందిన సెలబ్రిటి ఒక్కసారిగా రెడ్‌ కార్పెట్‌పైకి వెళుతూనే తన దుస్తులను విప్పి అర్ధ నగ్నంగా నినాదాలు చేసింది. ఆమె శరీరంపై ఉక్రెయిన్‌ జెండా రంగులను వేసుకొని మాపై జరిగే అత్యాచారాలను ఆపండి అంటూ నినాదాలు చేసింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది ఆమెపై దుస్తులు కప్పి అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. అయితే.. గతంలోనూ ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కారణంగా ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలు జరిగాయని పలు వార్తా కథనాలు వెలువడ్డాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)