మథుర మసీదుపై కోర్టులో పిటిషన్

Telugu Lo Computer
0


వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదు సర్వే అంశం ఇటీవల చర్చల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. వీడియో సర్వే నివేదిక ఇంకా కోర్టుకు అందాల్సి ఉంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో శ్రీకృష్ణ జన్మస్థానమైన మథురలో ఉన్న షాహీ ఈద్గా మసీదుపై స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలైంది. మసీదు ఉన్న ప్రాంతం కృష్ణుడి జన్మ స్థలమని, మసీదు నిర్మాణానికి ముందు ఇక్కడ దేవాలయం ఉండేదని ఇద్దరు న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపున న్యాయవాది మాట్లాడుతూ.. 'హిందూ దేవాలయ అవశేషాలపై మసీదు నిర్మించారు. ఔరంగజేబు శ్రీ కృష్ణుడి ఆలయంలో కొంత భాగాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారు. దీంతో మసీదులో నమాజు చేయకుండా శాశ్వత నిషేధం విధించాలని కోర్టు వారిని కోరాం' అని వెల్లడించారు. తాజా పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు జులై 1 నుంచి విచారణ జరుపుతామని తెలిపింది. గతంలో కూడా మసీదు తొలగించాలని మథుర కోర్టులో పది పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రజలకిచ్చిన వాగ్దానాల్లో మథుర ఆలయం కూడా ఒకటి కావడం గమనార్హం.


Post a Comment

0Comments

Post a Comment (0)