హిమాలయాలు, హిందూ మహా సముద్రం మధ్య నివసించే వారందరూ హిందువులే !

Telugu Lo Computer
0


భారత దేశం హిందూ దేశం’ అనే వాదనపై నేటికీ భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. మత సామరస్యాన్ని చాటుతూ భిన్నత్వంలో ఏకత్వంగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది భారత్.ఇతర దేశాల దండయాత్రల కారణంగా భారత దేశం ఉనికి కోల్పయిందన్నది జగమెరిగిన సత్యం. ఈక్రమంలో భారతీయత, హిందుత్వం అనే పదాలకు అసలు నిర్వచనం చెబుతూ కొందరు వ్యక్తులు తమ అభిప్రాయాలను దేశ ప్రజలముందు ఉంచుతున్నారు. భరత ఖండంలోని ఉత్తరాన హిమాలయ పర్వత శ్రేణులు మరియు దక్షిణాన హిందూ మహాసముద్రం మధ్య నివసించే ప్రజలందరూ హిందువులేనని కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే అన్నారు. హిందువు అనేది మతం కంటే చాలా గొప్పదని, అది ఒక జీవన విధానమని భారతీయులకు, భారతీయతకు అదొక భౌగోళిక గుర్తింపు అని అశ్విని కుమార్ చౌబే అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘డిజిటల్ హిందూ ఎన్‌క్లేవ్’ సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని కుమార్ శనివారం మాట్లాడుతూ, “మన దేశం విజ్ఞాన సుసంపన్న దేశమని, ఈ విషయాన్నీ విదేశీ పండితులు సైతం అంగీకరించారని’ అని అన్నారు. “హిందూత్వం అనేది ఒక జీవన విధానమని, మనం ‘హిందూ’ అనే పదాన్ని కొన్ని హద్దులకే పరిమితం చేయకూడదని ఆయన సూచించారు.“హిందువు అనేది భౌగోళిక గుర్తింపు. హిమాలయాలు మరియు హిందూ మహాసముద్రం మధ్య నివసించే ప్రజలందరూ హిందువులే,” అని కేంద్రమంత్రి అన్నారు. భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తికి హిందూ పూర్వీకులు ఉన్నారని, ఇది తప్పనిస రిగా ప్రతి ఒక్కరినీ హిందువులుగా మారుస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని కుమార్ ఉటంకించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)