ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్‌ పుట్టుకొచ్చాడు...!

Telugu Lo Computer
0


కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అల్లాడిపోయారు.. ఆర్థిక పరిస్థితులు కుదేలయ్యాయి. అయితే కరోనా మాత్రం కొందరి బాగా కలిసొచ్చింది. రాత్రికి రాత్రే కుబేరులయ్యారు. కొవిడ్‌-19 సంక్షోభం సమయంలో ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్‌ తయారయ్యాడు. ఇంధన రంగ వ్యాపారాలు, ఆహారోత్పత్తులతో సంపద ప్రతి రెండు గంటలకు రూ.7,700 కోట్లకుపైగా వృద్ధి జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 33 గంటలకు 10 లక్షల మంది తీవ్ర పేదరికంలోకి దిగ జారిపోయారు. 'ప్రాఫిటింగ్‌ ఫ్రమ్‌ పెయిన్‌' పేరుతో ఆక్స్‌ఫామ్‌ అనే కంపెనీ ఈ వివరాలను వెల్లడించింది. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా ఆక్స్ ఫామ్ కంపెనీ ఈ నివేదికను ప్రపంచానికి చేదు వాస్తవాలను తెలియజెప్పింది. కరోనా మహమ్మారి కొనసాగుతున్న సమయంలోనే ఇంధనం, ఆహారంతో పాటు వస్తు సేవల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నింటాయి. దశాబ్దకాలంలో పెరగాల్సిన ఈ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కరోనా కాలంలో బిలియనీర్ల సంపాదన పెరగడానికి అసలు కారణం ఏంటంటే.. వాళ్లవి 24గంటలు కష్టపడితే వచ్చిన ఆదాయం కాదట.. అదే విషయాన్ని ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గాబ్రియేలా బుచర్‌ వెల్లడించారు. రెక్క ఆడితేగానీ డొక్క ఆడని బతుకులైన నిరుపేద కార్మికులు అతి తక్కువ వేతనాలకు కాయాకష్టం చేస్తున్నారు. ధనవంతులు మాత్రం ఎలాంటి దయలేకుండా వ్యవస్థను దశాబ్దాలుగా తమ కనుసన్నల్లో పెట్టుకున్నారు. ఫలితంగా భారీ ఆదాయాలను కూడబెట్టుకుంటున్నారు. ఇందులో ప్రైవేటీకరణ, కార్మికుల హక్కులను కాలరాయడంతో పాటు గుత్తాధిపత్యం, పన్నురహిత దేశాల్లో సంపాదించిన మొత్తాన్ని కూడబెట్టడం ద్వారా బిలియనీర్లగా మారిపోయారు. కరోనా కాలంలో కొత్త బిలియనీర్లు 573 మంది పుట్టుకొచ్చారు. ఆహారోత్పుత్తల రంగంలో 66మంది కొత్తగా బిలయనీర్లు పుట్టుకురాగా.. ప్రతి 33 గంటలకు కటిక పేదరికంలోకి 10 లక్షల మందికి కూరుకుపోయారు. టీకాల పేరిట మోడెర్నా, ఫైజర్ సెకనుకు 1000 డాలర్ల ఆదాయాన్ని ఆర్జించాయి. ఫార్మా రంగంలో 44 మంది కొత్త బిలియనీర్లు చేరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)