విమానం విండోస్ రౌండ్ గా ఎందుకు ఉంటాయి ?

Telugu Lo Computer
0


విమానంలో ఎక్కి జాలీగా ప్రయాణం అందరికీ ఎంతో ఇష్టం. అయితే గాల్లోకి ఎలా ఎగురుతుంది. ఎలా ప్రయాణిస్తోంది.. అంత బరువు తేలికగా గాలిలోకి ఎలా ఎగురుతోంది. విమానంలో ఏ ఇంధనం పోస్తారు. ఎంత మంది పైలట్స్ ఉంటారు. ఇలా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అయితే విమాన కిటికీలు రౌండ్ గానే ఎందుకు ఉంటాయని ఎప్పుడైనా అనిపించిందా? విమానానికి ఉన్న కిటికీల ఆకారం కూడా ప్రయాణానికి సహకరిస్తుంది. విమానాల కిటికీలు గుండ్రంగా ఉన్నాయి. కానీ 1950 కి ముందు విమాన కిటికీలు చతురస్రాకారంలో ఉండేవంట. వాటి స్పీడ్ కూడా తక్కువగానే ఉండేది. అలాగే తక్కువ స్పీడ్ తో గాల్లోకి ఎగిరేవి. అయితే చతురస్రాకారంలో ఉండే కిటికీల వల్ల విమాన స్పీడ్ పై ప్రభావం చూపేదట.. అంతే కాకుండా భద్రత విషయంలో కూడా ప్రభావం చూపేదని చెబుతున్నారు. విమాన స్పీడ్, ప్రమాదాలపై కూడా ప్రభావం చూపేవట. అందుకే విమానాల కిటికీలు గుండ్రంగా ఉండేలా రిజైన్ చేశారు. గాలిలో ప్రయాణించే విమానం లోపల బయట గాలి ఒత్తిడి ఉంటుంది. పైకి వెళ్లేకొద్ది గాలి ఒత్తిడి మరింత పెరుగుతుంది. అయితే విమాన కిటికీలు గుండ్రంగా ఉండటం వల్ల గాలి పీడనాన్ని అన్నింటిపై సమానంగా చేరేలా చేస్తుందట. రౌండ్ కిటికీల వల్ల స్పీడ్ పెరిగి, ప్రమాదాల సంఖ్య తగ్గిందని చెబుతున్నారు. అలాగే గాలి ఒత్తిడికి విండోస్ బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా తక్కువగానే ఉంటాయి. అందుకే 1950 తర్వాత ఫ్లైట్ విండోస్ రౌండ్ గా ఉండేలా డిజైన్ చేశారట. ఈ రౌండ్ విండోస్ చూడటానికి కూడా అందంగా కనిపిస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)