పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 25 April 2022

పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం


నిత్యావసరాలు ధరలతో సామాన్యుడు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయిల్ రేట్లు, పప్పుల ధరలు, కూరగాయల రేట్ల పెరుగుదల భయపెడుతున్నాయి. ఇప్పుడు దీనికి పామాయిల్ రేట్లు కూడా తోడయ్యాయి. ఇప్పటివరకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలకు రెక్కలు వచ్చాయనుకుంటే ఇప్పుడు ఇండోనేషియా మరో ఝలక్ ఇచ్చింది. స్థానికంగా నెలకొన్న పరిస్థితుల వల్ల పామాయిల్ ఎగుమతులను ఈ నెల 28 నుంచి నిలిపివేస్తున్నామని ఇండోనేషియా ప్రకటించింది. దీంతో వంట నూనెల ధరలు మళ్లీ పెరగబోతున్నాయి. ఇప్పటికే టోకు వ్యాపారులు పామాయిల్ అమ్మకాలను ఆపేశారు. దీంతో వారం కిందట లీటరు పామాయిల్ ధర రూ.140 ఉంటే ఇప్పుడు రూ.150, రేపో, ఎల్లుండో రూ.160 కు పెరిగే ఛాన్సుంది. తెలంగాణలో ఎక్కువగా వాడే నూనెల్లో వినియోగంలో దాదాపు 60 శాతం పామాయిలే ఉంటుంది. అందుకే వారిపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే లీటరు పెట్రోల్ రేటు దాదాపు రూ.25, డీజిల్ ధర దాదాపుగా రూ.17 మేర పెరిగింది. దీంతో రవాణా వ్యయం పెరిగింది. ఆ ఎఫెక్ట్ మిగిలిన అన్ని వస్తువుల ధరలపైనా పడింది. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చే ఉల్లిపాయల లారీ లోడుకు అదనంగా రూ.3000-4000 తీసుకుంటున్నారు. ఆటో, క్యాబ్ అద్దెలు కూడా ట్రిప్పుకు రూ.20-40 అదనంగా వసూలు చేస్తున్నారు.

No comments:

Post a Comment