రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వడగాల్పులు

Telugu Lo Computer
0


తెలుగు రాష్ట్రాలో భానుడు భగభగమంటున్నాడు. మే రాక ముందే ఎండలు మండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ లో మొత్తం 670 మండలాలకు గాను ఏప్రిల్‌ 8న  16 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఈ మండలాలన్నీ కడప, కర్నూలు జిల్లాల్లోనే ఉండడం గమనార్హం. రానున్న 24 గంటల్లో  తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని మండలాల్లో వడగాల్పులు  వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని 6 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని మండలాల్లో వడ గాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)