సోనమ్‌ కపూర్‌ ఇంట్లో భారీ చోరీ

Telugu Lo Computer
0


బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ ముద్దుల తనయ సోనమ్‌ కపూర్‌ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 2.4 కోట్ల విలువైన సొత్తు ఫిబ్రవరి నెలలో చోరీకి గురి కాగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని అమృతా షెర్లింగ్‌ మార్గ్‌లో ఉన్న విలాసవంతమైన భవనంలో సోనమ్‌, ఆమె భర్త ఆనంద్‌ ఆహుజా ఉంటున్నారు. ఇంటి వ్యవహారాలు చూసే మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే విషయం బయటకు పొక్కింది. ఫిబ్రవరి 11న దొంగతనం జరిగితే అదే నెల 23వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారని ఉన్నతాధికారి తెలిపారు. ఇంట్లో మొత్తం అందరినీ ప్రశ్నించామని అన్నారు. అయితే ఆ ఇంట్లో ఎంత మంది పనిచేస్తున్నారో వారు కచ్చితంగా చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. కేసు పూర్తి వివరాలు చెప్పేందుకు ఇష్టపడని అధికారి.. చోరీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)