ప్రపంచంలోనే అతిపెద్ద చర్చి నిర్మాణం

Telugu Lo Computer
0


ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలోని సెర్చిప్‌ జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద చర్చి భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఈ విషయాన్ని మిజోరంకు చెందిన ఓ క్రిస్టియన్‌ గ్రూప్‌ ప్రకటించింది. ఈ ప్రతిపాదిత చర్చిని 23,809.52 చదరపు మీటర్లలో నిర్మించనున్నారు. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద చర్చిగా ఉన్న వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్‌ బసిలికా ఉన్న స్థలం కంటే 809.52 చదరపు మీటర్లు ఎక్కువని గ్రూప్‌ చీఫ్‌ జైచావ్నా హ్లాండో పేర్కొన్నారు. సెర్చిప్ జిల్లాలో నిర్మించబోయే ఈ భారీ చర్చి పొడవు, వెడల్పు ఒక్కొక్కటి 270 అడుగులు ఉంటాయని ఎత్తు 177 అడుగులు ఉంటుందని తెలిపారు. చర్చి భవనం లోపన 30,000 సీట్లు ఉంటాయని హ్లాండో తెలిపారు. ఈ చర్చి భవనాన్ని క్రైస్తవులు ప్రార్ధనా సభలు నిర్వహించుకోవటానికి ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఈ చర్చి అన్ని మిజోరాం తెగలకు చెంది ఉంటుందని ఈ భారీ చర్చిని నిర్మించటానికి స్థలాన్ని కూడా కొనుగోలు చేశామని తెలిపారు. నిర్మాణ పనులు ఇంకా ప్రారంభించలేదని జోరామ్ ధార్ గ్రూప్ లీడర్ ఒకరు తెలిపారు.గ్రూప్ సభ్యులు బైబిట్ పితృస్వామ్యుడైన జాకబ్ 12 కుమారులలో ఒకరైన జోసెఫ్ వారసులమని తెలిపారు. కాగా హ్లాండ్లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రెస్బిటేరియన్ చర్చ్ ఆఫ్ మిజోరాంలోని మిషనరీగా పనిచేశారు. 2012లో మిజోరం తిరిగి రావటానికి ముందు బ్రిటన్ లో స్థిరపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)