అమ్మాయికి బదులు అత్తగారి మెడలో మాల..! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 1 April 2022

అమ్మాయికి బదులు అత్తగారి మెడలో మాల..!


సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో వివాహ వేడుకల వీడియోలను నెటిజన్లు బాగా ఇష్టపడుతుంటారు. వివాహ సందర్భంలో చాలా వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తాయి. తాజాగా ఓ వివాహానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఈ వీడియో చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో వరుడు మద్యం మత్తులో కనిపిస్తాడు. స్టేజ్‌పై నిలబడి ఉంటాడు కానీ అతడు సోయిలో ఉండకపోవడం మనం గమనించవచ్చు. సరిగ్గా ఇదే సందర్భంలో వరుడు వధువు మెడలో మాల వేయాల్సిన సమయం వస్తుంది. కానీ వరుడు ఏమి అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటాడు. మాల వధువు మెడలో వేయడానికి బదులు అత్తగారి మెడలో వేయబోతాడు. సరిగ్గా అప్పుడే అతడి చుట్టు ఉన్న వ్యక్తులు ఈ పని చేయకుండా ఆపుతారు. తర్వాత వధువు మెడలో వేయాల్సిందిగా సూచిస్తారు. కానీ అతడు ఆ పని కూడా చేయడు. మద్యం మత్తులో వధువు మెడలో మాల వేస్తూనే కింద పడిపోతాడు. ఇది చూసిన వధువు ఆశ్చర్యపోతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్ల వరుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశాడు. ఇప్పటి వరకు ఈ వీడియోని వేల సంఖ్యలో చూశారు. కామెంట్ల ద్వారా తమ స్పందనని తెలియజేస్తున్నారు. ఒక నెటిజన్ ' తాగుబోతు వ్యక్తికి పెళ్లి అవసరమా అని ప్రశ్నించాడు' ఇంకొకరు 'పెళ్లి రోజు కూడా తాగాలా' అంటూ మండిపడ్డాడు. చాలామంది పెళ్లికొడుకి తీరుని తప్పుబట్టారు. 

No comments:

Post a Comment