22 యూట్యూబ్ చానళ్లను బ్లాక్ చేసిన కేంద్రం

Telugu Lo Computer
0



దేశ భద్రతకు, విదేశీ సంబంధాలకు విఘాతం కలిగిస్తున్న 22 యూ ట్యూబ్ ఛానళ్ళను కేంద్ర సమాచారం ప్రసార మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. వీటిలో 18 భారత దేశానికి చెందినవి కాగా, నాలుగు ఛానల్స్ పాకిస్తాన్ లో ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ప్రకారం తొలిసారిగా 18 యూ ట్యూబ్ ఛానళ్ళను బ్లాక్ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. వీక్షకులను తప్పుదోవ పట్టించేందుకు కొన్ని టీవీ చానెళ్ల లోగోలను కూడా ఈ యూట్యూబ్ ఛానళ్ళు ఉపయోగించాయని మంత్రిత్వ శాఖ పేర్కోంది. తప్పుడు థంబ్ నెయిల్స్‌తో ప్రజలను గందరగోళ పరిచినట్లు తెలిపింది. వీటితో పాటు మూడు ట్విట్టర్ అకౌంట్లు ఓ ఫేస్ బుక్ ఎకౌంట్, ఒక న్యూస్ వెబ్ సైట్ ను కూడా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. బ్లాక్ చేసిన యూ ట్యూబ్ చానళ్లకు వీక్షకుల సంఖ్య సుమారు 260 కోట్ల మంది ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి యూట్యూబ్ చానళ్లను బ్లాక్ చేయటం ఇదే మొదటి సారి. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఐటీ నిబంధనలు అమలు చేయటం ద్వారా 78 యూ ట్యూబ్ చానల్స్ నిషేధింపబడ్డాయి. నిషేధించిన యూట్యూబ్ చానళ్లు జమ్ము కాశ్మీర్ గురించి, ఉక్రెయిన్ లో ఉన్న పరిస్ధితులపై తప్పుడు వార్తలు ప్రసారం చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)