త్వరలో భారత్ నుంచి నేపాల్ కు రైలు !

Telugu Lo Computer
0


దేశాల మధ్య రైల్వే లైన్లు అభివృద్ధి చేసుకోవడం ద్వారా “భౌగోళికంగా దక్షిణాసియా దేశాలు” ఎంతో దగ్గరౌతున్నాయని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా అన్నారు. విదేశాంగ విధాన ప్రాధాన్యతలన్నింటిలో భారత్ తన పొరుగు దేశాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని శ్రింగ్లా అన్నారు. ఇటీవల ఓ విద్యాసంస్థ సమావేశం సందర్భంగా విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా మాట్లాడుతూ భారత్ నుంచి త్వరలో నేపాల్‌ కు రెండు రైల్వే లైన్లు, బంగ్లాదేశ్‌తో ఆరు రైలు నెట్‌వర్క్‌లు అనుసంధానించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా దేశాల్లోని అంతర్గత ప్రాంతాలతోనూ రవాణా సౌకర్యాన్ని పెంపొందించే విషయమై విస్తృతంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు శ్రింగ్లా వివరించారు. పొరుగు దేశంలోని వివిధ ప్రాంతాలలో రోడ్డు, నీటి మార్గం, రైలు మరియు విమానాల ద్వారా “మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ”ని క్రమంగా మెరుగుపరుచుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం, భారత్ – బంగ్లాదేశ్ మధ్య పలు రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో నేపాల్, భూటాన్ మరియు మాల్దీవులకు వెళ్లే భారతీయులకు వీసాలు అవసరం లేదు. శ్రీలంక, యాంగాన్‌ (మయాన్మార్)లోని భారత దౌత్య కార్యాలయాల నుంచి వీసా జారీలలో పెరుగుదల కనిపించినట్లు శ్రింగ్లా పేర్కొన్నారు. ఇక రవాణా సౌకర్యాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు పొరుగు దేశాల్లో ఇంధన రంగంపైనా భారత్ దృష్టి సారించిందని శ్రింగ్లా అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)