లోక్ సభ సభ్యత్వానికి అఖిలేశ్ యాదవ్ రాజీనామా

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కార్యాలయానికి వెళ్లి తన రాజీనామా లేఖను అఖిలేశ్ సమర్పించారు. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ కర్హాల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ఎస్ పి సింగ్ బఘేల్ పై 60వేల కంటే ఎక్కువ ఓట్లతో గెలిచారు. 403 స్థానాలు కలిగిన యూపీలో అఖిలేశ్ సమాజ్ వాదీ పార్టీ 111 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ సింగిల్ గా బరిలోకి దిగి 255 సీట్లను గెలిచి యూపీలో మళ్లీ అధికారాన్ని చేజిక్కిచ్చుకుంది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 2019లో అజంగఢ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)