స్టాక్ మార్కెట్లు అతలాకుతలం

Telugu Lo Computer
0


దలాల్ స్ట్రీట్‌ మరోసారి ఢమాల్ అయ్యింది. ఉక్రెయిన్‌ పై చేపడుతున్న రష్యా యుద్ధం పలు రంగాలపై భారీ ప్రభావం పడుతోంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు.. మరో రెండు రోజుల్లో వెలువడనున్న ఎన్నికల ఫలితాలు.. ఇవన్నీ కలిపి బుల్‌ను బేజారు చేస్తున్నాయి. ఈ అంశాలన్ని దేశీయ స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో 2022, మార్చి 07వ తేదీ సోమవారం భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అత్యంత భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 15 వందల పాయింట్ల నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. ఇక నిఫ్టీ 15 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. మార్కెట్లను కీలకంగా ప్రభావితం చేస్తున్న క్రూడాయిల్ ధరలు. అంతర్జాతీయంగా రోజురోజుకు పెరుగుతున్న క్రూడాయిల్‌ ధరలు కూడా మార్కెట్లలో భయాలను పెంచుతున్నాయి. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 128 డాలర్లకు చేరింది. రష్యా చమురు ఉత్పత్తులపై అమెరికా నిషేధం విధించడం దాదాపుగా ఖరారు కావడంతో క్రూడాయిల్‌ ధరలకు రెక్కలు వచ్చాయి. మరికొన్ని గంటల్లోనే బ్యారెట్‌ చమురు 130 డాలర్లను క్రాస్‌ చేయడం పక్కా అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. అది 140 డాలర్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)