రైల్లో హద్దుమీరితే జైల్ కే..!

Telugu Lo Computer
1


ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించే సమయంలో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రయాణికులు ఏ సమయంలోనైనా 139 నంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పించింది. ముఖ్యంగా రాత్రివేళ ప్రయాణాల్లో నిర్దేశించిన మార్గదర్శకాలకు భిన్నంగా ప్రవర్తించే వారిపై కొరడా ఝళిపిస్తోంది. ప్రయాణ సమయంలో ఇబ్బందులు పడుతూ 139 నంబరుకు ఫోన్‌ చేసి వివరాలు తెలియజేసిన కొద్దిసేపటికే రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్‌) సిబ్బంది బోగీలోకి వచ్చి సహాయం అందిస్తారు. మరీ మితిమీరి ప్రవర్తించిన వారిని అవసరమైతే జైలుకు పంపిస్తారు. ముఖ్యంగా వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు తక్షణ సహాయం అందిస్తారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే మన ప్రాంతంలోని ప్రయాణికులకు దీనిపై పూర్తిస్థాయిలో అవగాహన లేదు. అందుకే స్టేషన్‌కు వచ్చి నిరీక్షించే సమయంలోనే ప్రయాణికుల్లో చైతన్యం పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.

నిబంధనలు : ల్యాప్‌టాప్‌, ఫోన్లలో బిగ్గరగా సంగీతం వినకూడదు. తోటివారికి ఇబ్బంది కలిగించే విధంగా ఫోనులో మాట్లాడకూడదు. రాత్రి పది అవ్వగానే బోగీల్లో లైట్లు అన్నీ ఆఫ్‌ చేసి కేటాయించిన బెర్తుల్లో పడుకోవాలి. బెర్తుల్లో గుంపులుగా చేరి పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ ఇబ్బందికరంగా ప్రవర్తించకూడదు. అర్థరాత్రి వరకు మాట్లాడుతూ కూర్చోకూడదు. మహిళలు, పిల్లలు పట్ల అసభ్యంగా ప్రవర్తించకూడదు. ప్రయాణికులపై అనవసరంగా గొడవలకు దిగకూడదు. కేటాయించిన బెర్తుల్లో హుందాగా ప్రవర్తించాలి. వృద్ధులు, దివ్యాంగులు పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు. రైల్వే సెక్యూరిటీ, భోజనం, కోచ్‌ల పరిశుభ్రత, తక్షణ వైద్యసహాయం, ఫిర్యాదులు వంటి వాటిని కూడా ఈ నంబరుకు ఫోన్‌ చేసి తెలపవచ్చు. ప్రతి ఒక్కరు 139 నంబరు ఫోన్‌లో సేవ్‌ చేసుకొని ప్రయాణ సమయంలో ఇబ్బందులకు గురైతే ఫిర్యాదు చేయవచ్చు. 

Post a Comment

1Comments

  1. Yes, మొబైల్ ఫోన్ లో బిగ్గరగా సంగీతం పెట్టడం అన్నది న్యూసెన్స్ గా తయారయింది. 139 సౌలభ్యం నిజంగా పని చేస్తే చాలా సహాయకారి అవుతుంది.

    ReplyDelete
Post a Comment