పంజాబ్‌ డిప్యూటీ సీఎంగా హర్‌పాల్ సింగ్‌? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 18 March 2022

పంజాబ్‌ డిప్యూటీ సీఎంగా హర్‌పాల్ సింగ్‌?


పంజాబ్‌లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయ్యింది. శనివారం ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆప్ నేతలు అంటున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఒంటి గంటకు సీఎం భగవంత్ మాన్ అధ్యక్షతన మొదటి కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఎవరెవర్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలో సీఎం భగవంత్ మాన్ ఇష్టానికే కేజ్రీవాల్ వదిలేసినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విషయంలో తమ జోక్యం ఉండదని కేజ్రీవాల్ తేల్చిచెప్పినట్లు ఆప్ వర్గాలు అంటున్నాయి. క్లిష్ట సమయంలో పార్టీ వెన్నంటే వున్న వారు, పూర్తి నమ్మకస్తులను మాత్రమే భగవంత్ మాన్ తన మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. పంజాబ్ ఆమ్ ఆద్మీలో అత్యంత ముఖ్యుడైన హర్‌పాల్ సింగ్ చీమాను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో ఆప్ పాతుకుపోవడంలో ఈయనది కీలక పాత్ర. ఈ విషయాన్ని సీఎం భగవంత్‌మాన్‌, అధిష్ఠానం గుర్తించే, ఆయనకు డిప్యూటీ సీఎంగా  ఇవ్వనున్నారు.

No comments:

Post a Comment