కపిల్‌ సిబల్‌ను బహిష్కరించాలి!

Telugu Lo Computer
0


పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కపిల్‌ సిలబ్‌ను బహిష్కరించాలని ఛత్తీస్‌గఢ్‌ మంత్రి టీఎస్‌ సింగ్‌దేయో డిమాండ్‌ చేశారు. అన్ని విధాలుగా సిబల్‌ చేసిన ప్రకటన దారుణమైందని, సీడబ్ల్యూసీ నిర్ణయానికి వ్యతిరేకంగా తన వ్యక్తిగత, అసహ్యకరమైన అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమిని చవిచూసిన తర్వాత కపిల్‌ సిబల్‌ కాంగ్రెస్‌ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీలను పక్కన పెట్టి పార్టీని నడిపించే మరో నాయకుడికి అవకాశం ఇవ్వాలన్నారు. ఆయన వ్యాఖ్యలపై అధిష్టానంతో పాటు సీనియర్‌ నేతలు సైతం గుర్రుగా ఉన్నారు. జీ-23కి చెందిన నేతలు 2020లో సోనియాగాంధీకి పార్టీ పునర్జీవానికి, శాశ్వత అధ్యక్షుడిని నియమించాలని లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ జీ-23 గ్రూప్‌లో కపిల్‌ సిబల్‌ సైతం ఉన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)