నిర్ణయాధికారాలన్ని మహిళలవే...!

Telugu Lo Computer
0


మహిళా సాధికారత అంటే ఇదే అన్నట్లుగా ఉంటుంది మహారాష్ట్రలోని జౌరంగాబాద్‌ నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న బకాపూర్‌ గ్రామం. లింగ సమానత్వాన్ని పాటిస్తూ ఆదర్శ గ్రామంగా నిలిచింది బాకాపూర్‌. బాకాపూర్‌లోని ప్రతి ఇంటి నేమ్‌ ప్లేట్‌ పై మహిళ పేరే ఉంటుంది. ఆ గ్రామంలో రెండు వేలమంది నివసిస్తుంటారు. ఇక్కడ ప్రతి ఇంటికి ఓ పేరు ఉంటుంది. ఆ నేమ్ ప్లేట్ మీద ఆ ఇంటి మహిళ పేరే ఉంటుంది. బాకాపూర్ లో ప్రతి ఇంటికి మహిళే హక్కుదారిగా ప్రకటించి లింగ సమానత్వానికి గ్రామాధికారులు పెద్ద పీట వేశారు. పంచాయతీ రికార్డుల్లో కూడా యజమానిగా మహిళ పేరే ఉంటుంది. 2008లో గ్రామ పంచాయతీ చేసిన ప్రత్యేక ప్రతిపత్తితోనే ఈ మహిళా సాధికారత జరిగింది. ఈ మహిళా ఇళ్లకు సంబందించి బాకాపూర్ సర్పంచ్ కవితా సాల్వే మాట్లాడుతూ…”ఇలా మహిళల పేరు మీదనే ఇళ్లు ఉండటం వల్ల మహిళలు సొంతగా నిర్ణయాలు తీసుకుంటు సాధికారత ఆలోచనలు చేస్తున్నారని తెలిపారు. ఇంటి విషయాలకు సంబంధించిన నిర్ణయాలను మహిళలే తీసుకుంటున్నారని గర్వంగా చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)