కొత్త చార్జీల పెరుగుదల స్వల్పమే ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 31 March 2022

కొత్త చార్జీల పెరుగుదల స్వల్పమే !


గృహ విద్యుత్తు వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం షాక్ ఇస్తూ విద్యుత్తు ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమర్థిస్తూ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఇప్పటివరకు ఉన్న కేటగిరీల స్థానంలో కొత్తగా ఒకే గ్రూపు కింద ఆరు శ్లాబులను తెచ్చి ప్రజలపై అధిక భారం లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు ఏపీఈఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి నిన్న మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను బాలినేని గుర్తు చేశారు. కామన్‌ గ్రూపు వల్ల స్వల్పంగానే పెంపు. ఒక వినియోగదారుడు నెలకు 250 యూనిట్ల విద్యుత్‌ వాడితే మొదటి 30 యూనిట్ల వరకూ యూనిట్‌కు రూ.1.90, తర్వాత 45 యూనిట్లకు యూనిట్‌కు రూ.3, ఆ తర్వాత 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.4.50, అనంతరం 100 యూనిట్ల వినియోగానికి యూనిట్‌కు రూ.6.0, చివరి 25 యూనిట్లకు యూనిట్‌కు రూ. 8.75 చొప్పున పడుతుంది. ఆ విధంగా వినియోగదారునికి బిల్లు మొత్తం రూ.1,235.75 అవుతుంది. ఇదే బిల్లు పాత విధానం ధరల ప్రకారం అయితే మొత్తం బిల్లు రూ.1,195 వస్తుంది. అంటే కొత్త చార్జీల ప్రకారం పెరుగుతున్న బిల్లు రూ.40.75 మాత్రమే' అని చెప్పుకొచ్చారు.

No comments:

Post a Comment