సమ్మక్కకు విస్కీ తాగించిన రాం గోపాల్‌ వర్మ

Telugu Lo Computer
0


సంచనాలు, వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ టాలీవుడ్‌ దర్శకుడు రాం గోపాల్‌ వర్మ. ఎప్పుడు ఏదో ఒక అంశంపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటాడు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీతారలనే టార్గెట్‌ చేస్తూ కౌంటర్లు ఇస్తుంటాడు. తాజాగా మరో వివాదాస్పద పోస్ట్ చేశాడు వర్మ. తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ దేవతగా సమ్మక్కను అందరూ కొలుస్తారు. అలాంటి దేవతకు వర్మ విస్కీ ఆఫర్ చేస్తున్నానంటూ విస్కీ మందు చూపించాడు. అదికూడా కొండా మురళి, కొండా సురేఖ ఇంట్లో నేనంటూ వారు కూడా చూస్తున్నారంటూ ఆ ఫోటో తీసే ఆమె కొండ మూవీ నిర్మాత అని ఇలా వర్మ చెప్పుకుంటూ వచ్చాడు. దేవతలకు మందు తాగించడం ఏమిటని ఈ పోస్టర్ ను చూసిన నెటిజన్లు వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)