కాలికి తీగలు తగిలి భవనంపై నుంచి పడి యువతి మృతి - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 24 February 2022

కాలికి తీగలు తగిలి భవనంపై నుంచి పడి యువతి మృతి


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా తగరపువలస మండలం సంగివలస అక్షర ఆర్కేడ్‌ అపార్టుమెంటులో ఉంటున్న దొడ్డుగల్లు జ్యోతిర్మయి మోనాలిసా (18) ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడి గురువారం ఉదయం మృతి చెందింది. వీరి కుటుంబం రెండో అంతస్థులో నివాసముంటోంది. ఉతికిన బట్టలను ఆరబెట్టేందుకు మేడ పైకి (అయిదో అంతస్థు) వెళ్లింది. ఈ క్రమంలో కిందనున్న కాలికి తీగలు తగిలి పడిపోయింది. కొనఊపిరితో ఉన్న ఆమెను సమీప ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే ప్రాణాలు విడిచింది. ఈమె దాకమర్రిలోని ఓ కళాశాలలో బీఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతోంది. తండ్రి వెంకటేశ్వరరావు విశ్రాంత ఉపాధ్యాయుడు కాగా తల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. వీరి స్వస్థలం కేడీపేట. పదేళ్ల కిందట ఇక్కడ ఫ్లాట్‌ కొనుగోలు చేసి అందులోనే నివాసం ఉంటున్నారు. పెద్ద కుమార్తె మౌనిక సచివాలయంలో ఎమినిటీస్‌ కార్యదర్శి. భీమిలి ఎస్‌ఐ సంతోశ్‌కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జీవీ రమణ పేర్కొన్నారు. 

No comments:

Post a Comment