బయ్యారంలో ఉక్కు నిరసన దీక్ష - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 22 February 2022

బయ్యారంలో ఉక్కు నిరసన దీక్ష


తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డ తర్వాత వచ్చిన విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు ఏర్పాటు గురించి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయనున్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేయనున్నారు. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి బయ్యారం ఉక్కు పరిశ్రమ డిమాండ్ ఉంది. తాజాగా బయ్యారం ఉక్కు పరిశ్రమ రాదంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించడంతో తెరాస నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఉక్కు పరిశ్రమ గురించి అధ్యయనం చేయడానికి కేంద్రం నుంచి చాలా సార్లు బయ్యారానికి వచ్చారు. పరిశ్రమ ఏర్పాటుకు స్థలం, ఉక్కు రాయి, నీరు, విద్యుత్, రైల్వే లైన్ వంటి సదుపాయాలపై సర్వే చేశారు. అయితే ఇక్కడ ఇనుప రాయి నాణ్యతలో లోపం ఉందని ఉక్కు పరిశ్రమపై కేంద్రం చెతులెత్తేసింది. ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం ఇప్పటికే పలుమార్లు రిలే నిరాహార దీక్షలు, చలో కలెక్టరేట్ తదితర కార్యక్రమాలను చేపట్టగా  ఇవాళ మరోసారి ఒకరోజు దీక్ష నిర్వహిస్తున్నట్లు తెరాస నాయకులు ప్రకటించారు. ఈ దీక్షలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కవితతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొననున్నారు.


No comments:

Post a Comment