ఉక్రెయిన్‌లో ఎమర్జెన్సీ విధింపు

Telugu Lo Computer
0


ఉక్రెయిన్‌-రష్యా సరిహద్దుల్లో నెలకొన్న తీవ్రమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో 30 రోజుల పాటు అత్యవసర పరిస్థితి కొనసాగుతుందని ప్రకటించింది. అప్పటి వరకు ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోతే అత్యవసర పరిస్థితిని మరికొన్ని రోజులు పొడిగించవచ్చని తెలిపింది. వేర్పాటువాద ప్రాంతాలైన డొనెట్‌స్క్, లుహాన్‌స్క్‌లో తప్ప దేశంలోని మిగతా అన్ని ప్రాంతాల్లో అత్యవసర పరి​స్థితి 30రోజుల పాటు కొనసాగుతుందని ఉక్రెయిన్‌ ఉన్నత భద్రతాధికారి వెల్లడించారు. ఉక్రెయిన్‌లోని డొనెట్‌స్క్, లుహాన్‌స్క్‌ వేర్పాటువాద ప్రాంతాలను రష్యా నేరుగా తన అధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. రష్యా అనుకూల రెబెల్స్‌ అధీనంలో ఉన్న ఆ ప్రాంతాలకు 'స్వతంత్ర హోదా' ఇస్తున్నట్టు అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సోమవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)