ఆంధ్రప్రదేశ్‌ లో తగ్గుతున్న ఆడపిల్లల జనన రేటు!

Telugu Lo Computer
0


ఆడపిల్లలపై వివక్షను బయటకు చెప్పకున్నా సమాజంలో జనన రేటు దగ్గర బయటపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ లో బాలికల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని జిల్లాలో మరీ ఎక్కువగా ఉంది. ఇది భవిష్యత్‌కు ప్రమాదమని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. గడిచిన ఏడాది డిసెంబర్‌ వరకు చూస్తే సగటున వెయ్యి మంది అబ్బాయిలు పుడుతుంటే అమ్మాయిల సంఖ్య మాత్రం 937 మాత్రమే ఉంది. గడిచిన మూడు దశాబ్దాల నుంచీ ఇదే పరిస్థితి నెలకొని ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో దాదాపు ప్రతీ వెయ్యిలో 100కుపైగా వ్యత్యాసం ఉంటుంది. ఇది ఏమాత్రమ ఆమోదయోగ్యం కాదని  చెబుతున్నారు. రాష్ట్రంలో లింగనిర్ధారణ నిరోధక చట్టం పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఎక్కడైనా లింగనిర్ధారణ చేసినట్లు తెలిస్తే తీవ్ర చర్యలుంటాయని ఇప్పటికే స్కానింగ్‌ సెంటర్ల యాజమాన్యాలను ప్రభుత్వ అధికారులు హెచ్చరించారు. అయినా చాలా చోట్ల గుట్టు చప్పుడు కాకుండా పరీక్షలు జరగుతూనే ఉన్నాయి. పరీక్షలు చేసిన స్కానింగ్‌ సెంటర్‌ వైద్యులు (రేడియాలజిస్ట్‌/సోనాలజిస్ట్‌) పట్టాలు రద్దు చేయడాకైనా వెనుకాడేది లేదని అధికారులు చెబుతున్నారు. కొంతమంది గైనకాలజిస్ట్‌లు, రేడియాలజిస్ట్‌లు కుమ్మక్కై లింగనిర్ధారణ చేస్తూ, అబార్షన్లు నిర్వహిస్తున్నట్టు అనుమానాలున్నాయి. అన్ని జిల్లాలో అధికారులు స్కానింగ్‌ సెంటర్లపై నింఘా ఉంచాలని ఇప్పటికే రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ జిల్లా వైద్యాధికారులను ఆదేశించింది. ఈ సమస్యకు పరిస్కారం ప్రజల్లోంచి రావాలని చాలా మంది సామాజిక వేత్తలు అంటున్నారు. అనంతపురం జిల్లాలో 1,000 మంది అబ్బాయిలు పుడితే అమ్మాయిలు 902 మంది పుడుతున్నారు. కర్నూలు జిల్లాలో 908 అమ్మాయిలు పుడుతున్నట్టు వెల్లడైంది. గుంటూరు జిల్లా ఇందుకు మినహాయింపుగా ఉంది. అక్కడ ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 992 మంది అమ్మాయిలు ఉన్నారు. జనన రేటులో పశ్చిమ గోదావరిలో 964, నెల్లూరులో 963, పర్వాలేదనిపించేలా ఉన్నాయి. విశాఖ పట్నంలో 915, చిత్తూరులో 924, వైఎస్సార్ కడపలో 925, ప్రకాశంలో 926, విజయనగరం జిల్లాలో 938, శ్రీకాకుళం 939, కృష్ణా జిల్లాలో 949, తూర్పు గోదావరి జిల్లాలో 950 బర్త్ రేషియో నమోదైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)