షుగర్ ఉన్నవారికి కొర్రల అన్నం మంచి ఆహారం !

Telugu Lo Computer
0


డయాబెటిస్ ఉన్నవారికి కొర్రలను సూపర్‌ఫుడ్‌గా చెప్పవచ్చు. ఈ ఆధునిక జీవితంలో మంచి ఆరోగ్యాన్ని అందించే కొర్రలను చాలా మంది ఆహారంలో బాగంగా చేసుకుంటున్నారు. ఒకప్పుడు కొర్రలను పల్లెలలో మాత్రమే వాడేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. కొంత మంది తక్కువ పరిమాణంలో కొర్రలను బియ్యంలో కలిపి అన్నంలా వండి తినేవారు. కొర్రలకు డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే శక్తి ఉండటం వలన కొర్రలను వాడటం ఎక్కువైంది. కొర్రలలో పీచు పదార్థం సమృద్దిగా ఉండుట వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి డయబెటిస్, అధిక బరువు నియంత్రణలోను సహాయపడుతుంది. కొర్రల్లో 8 శాతం ఫైబర్‌ ఉంటుంది. 12 శాతం ప్రొటీన్లు ఉంటాయి. కొర్రలలో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది. రాల బలహీనత, బీపీ ఉండేవారికి, ఆస్తమా ఉండే వారు కొర్రల్ని తింటే ఆ సమస్యల నుండి బయట పడవచ్చు. నాడీవ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపే మోరెల్ విటమిన్ వీటిలో లభిస్తుంది. మానసిక దృక్పథానికి మద్దతు ఇస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచి వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ ని తగ్గిస్తుంది. కొర్రలలో ఉండే ప్రోటీన్ నాడీ వ్యవస్థ పనితీరు సజావుగా సాగేందుకు సాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారిలో నాడీ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. కొర్రలను అన్నంగా వండుకోవచ్చు. లేదా పిండిగా తయారుచేసుకొని అట్లు వంటి వాటిని కూడా వేసుకోవచ్చు.


Post a Comment

0Comments

Post a Comment (0)