కోడి - పాము మధ్య భీకర పోరు!

Telugu Lo Computer
0


ఒక కోడి తన పిల్లలను కాపాడుకోవడానికి ఎంతటి జంతువుతోనైన తలపడుతుంది. ఈ వీడియోలో ఓ కోడి గుడ్లను పొదుగుతున్న సమయంలో అక్కడికి ఓ భారీ త్రాచు పాము వస్తుంది. ఆ పాము గుడ్లను మింగాలని వాటి వైపు చూస్తుంది. కోడి కూడా నాగు పాము వైపు చూస్తుంది. బుసలు కొడితే కోడి పారిపోతుంది ఆతర్వాత గుడ్లను తినెయ్యవచ్చని పాము భావిస్తుంది. కానీ కోడి భయపడి పారిపోకుండా నాగుపామును ధైర్యంగా ఎదుర్కొంది. కోబ్రా గుడ్డు పట్టుకునేందుకు కోడిపై దాడికి ప్రయత్నించినా.. కోడి ఇక్కడ కూడా వెనక్కి తగ్గదు. పాము కోడి తలపై కాటు వేసేందుకు పాము ప్రయత్నించినా కోడి తన ముక్కుతో పాము తలపై పొడుస్తుంది.!! అలా పాము, కోడి మధ్య పోరు కొనసాగుతోంది. చివరికి పాము ఓడిపోయి వెనక్కి తగ్గుతుంది. కోడి పామును తరుముతూ తన గుడ్లను కాపాడుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)