అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసులో 38 మందికి మరణశిక్ష - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 17 February 2022

అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసులో 38 మందికి మరణశిక్ష


2008 అహ్మదాబాద్ వరస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 38 మందికి మరణశిక్ష విధించింది. దాదాపు పదమూడేళ్ల తర్వాత కోర్టు తీర్పు చెప్పింది. 38 మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో 28 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును విచారించింది. 2008లో అహ్మదాబాద్ సిటీలో దుండగులు 18 చోట్ల బాంబులు అమర్చారు. ఇవి కొన్ని చోట్ల పేలడంతో బాంబు దాడిలో 56 మంది మృతి చెందారు. 200 మందికి గాయాలయ్యాయి. జనాలు రద్దీగా ఉండే ప్రాంతాలలో స్కైవేలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, బస్ స్టేషన్లను టార్గెట్ గా చేసుకుని  బాంబులను అమర్చారు. అయితే కొన్ని చోట్ల అమర్చిన బాంబులు పేలకుండా బాంబ్ స్క్వాడ్ అధికారులు నిర్వీర్యం చేశారు. దీంతో పెద్దయెత్తున ప్రాణనష్టం తప్పింది.

No comments:

Post a Comment