ఎస్వీ ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆగడాలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ప్రిన్సిపాల్ సురేంద్ర, వార్డెన్ రామనాథంను కఠినంగా శిక్షించాలని విద్యార్థి, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనమైంది. దీనిపై స్పందించిన అధికారులు ప్రిన్సిపాల్, వార్డెన్‌ను సస్పెండ్ చేశారు. ప్రిన్సిపాల్ సురేంద్ర, వార్డెన్ రామనాథం అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ బాధిత విద్యార్థినులు వారం రోజుల కిందట టీటీడీ అధికారులను ఆశ్రయించారు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేపట్టాలంటూ టీటీడీ ఆదేశించింది. టీటీడీ ఆదేశాల మేరకు నిజనిర్ధారణ చేపట్టిన కమిటీ ప్రిన్సిపాల్, వార్డెన్ల లైంగిక వేధింపులు నిజమేనని తేల్చడంతో.. అధికారులు ఆ ఇద్దర్నీ సస్పెండ్ చేశారు. తమను లైంగికంగా వేధించిన ప్రిన్సిపాల్, వార్డెన్లపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలంటూ విద్యార్థినులు, మహిళా సంఘాలు కళాశాల ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. కాగా, విచారణ ఇంకా కొనసాగుతుందని, పూర్తి కాగానే చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)