ముస్లింలను బహిష్కరించిన గ్రామస్థులు

Telugu Lo Computer
0


ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లాలో ఓ గ్రామస్థులు ముస్లింలను బహిష్కరించారు. వారితో వాణిజ్య లావాదేవీలేవీ నిర్వహించబోమని, ముస్లింలకు తమ భూములను అమ్మేది లేదని ప్రతిజ్ఞ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు మొదలుపెట్టారు. 'ఈ రోజు నుంచి ముస్లింల దుకాణాల నుంచి వస్తువులేమీ కొనబోమని, వారికి మా భూములను అమ్మబోమని, లీజుకు ఇవ్వబోమని, ముస్లింలకు కూలీలుగా పనిచేయబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాం. వ్యాపారులెవరైనా మా ఊరికి వస్తే వారు ఏ మతానికి చెందినవారో తెలుసుకొన్నాకే వారి నుంచి వస్తువులను కొంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం' అని ఆ గ్రామానికి చెందిన హిందువులు చెప్తున్నట్టు ఆ వీడియోలో ఉన్నది. కుండికల గ్రామంలో ఈ వీడియోను చిత్రీకరించినట్టు తెలుస్తున్నది. గురువారం ఈ వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే జిల్లా అదనపు ఎస్పీ, సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ దర్యాప్తు చేపట్టారు.


Post a Comment

0Comments

Post a Comment (0)