నకిలీ కరెన్సీ నోట్లు కలకలం

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. మాదాపూర్ పరిధిలో రూ.2వేల నకిలీ కరెన్సీ నోట్లు కనిపించాయి. నడిరోడ్డుపై గుట్టలుగా పోసిన కరెన్సీ నోట్లను చూసి అటుగా వెళ్లే జనం ఎగబడి చూశారు. 100 ఫీట్ రోడ్ సమీపంలోని కాకతీయ రోడ్డులో రూ.2వేల కరెన్సీ నోట్లు గుట్టలుగా పోసి ఉంచారు. నోట్లను చూసిన వెంటనే స్థానికులు, వాహనదారులు కరెన్సీ నోట్లను తీసుకునేందుకు ఎగబడ్డారు. దొరికిన కరెన్సీ నోట్లను చాలామంది తీసుకున్నారు. రూ.2 వేల నోట్లపై చిల్డ్రన్ బ్యాంకు ఆఫ్ ఇండియా అని ఉండటంతో నోట్లు తీసుకెళ్లినవారంతా నిరుత్సాహానికి గురయ్యారు. నకిలీ కరెన్సీ నోట్లని తెలియక చాలామంది నోట్లను తీసుకునేందుకు ఎగబడ్డారు. కొంతసేపు భారీగా ట్రాఫిక్ జాం అయింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేశారు. రోడ్లపై గుట్టలుగా పడి ఉన్న నకిలీ రూ.2వేల కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాదిలో హైదరాబాద్ గోల్కొండ పరిధిలో నకిలీ కరెన్సీ కలకం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు భారీ మొత్తంలో నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్లతో సంబంధం కలిగిన ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో దగ్గర లభ్యమైన సంచుల్లో రూ.2వేలు, రూ.500 నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఇలా మరోసారి నకిలీ నోట్లు దొరికాయి. ప్రస్తుతం మార్కెట్లో రూ.2 వేల నోట్లు కనిపించడం లేదు. దాంతో ఆ నోట్లు అంటే జనం ఎగబడ్డారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)