మెగాస్టార్ ఎందుకు ప్రశ్నించాలి?

Telugu Lo Computer
1


సినిమా టికెట్ ధరల తగ్గింపు అనేది పెద్ద సమస్య కాదని టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. టికెట్ ధరలు తగ్గించడం వలన చిన్న సినిమాలను సమస్య ఉండదని చెప్పారు. ప్రజలందరికీ అందుబాటులో సినిమా టికెట్ ధరలు ఉండాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. టికెట్ ధరలు తగ్గించడం వలన కొంతమంది సంతోషపడుతున్నారని చెప్పుకొచ్చారు. టికెట్ రేట్లు తగ్గించడం వలన కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే సమస్య అని చెప్పారు. కాబట్టి పెద్ద సినిమాలను వేరే రేట్లు పెట్టమని ప్రభుత్వాన్ని కోరితే సరిపోతుందని సలహా ఇచ్చారాయన. అలానే చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఉండననే విషయంపై స్పందిస్తూ.. 'అందులో తప్పేముందని అన్నారు' తమ్మారెడ్డి భరద్వాజ. సినిమా ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవి పెద్ద దిక్కుగా భావించిందని.. కానీ కొంతకాలంగా ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులతో ఆయన విసిగిపోయి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి. అలానే సినిమా టికెట్ రేట్ విషయంపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడడానికి చిరంజీవి ముందుకు రాలేదనే విమర్శలపై కూడా ఆయన స్పందించారు. అసలు ఆయన ఈ విషయంపై ఎందుకు మాట్లాడాలని ప్రశ్నించారు. టికెట్ రేట్లపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల అసోసియేషన్స్ స్పందించాలని చెప్పారాయన. వాళ్లతో పనులు జరగడం లేదనప్పుడు మాత్రమే చిరంజీవి, బాలకృష్ణ లేదంటే నాగార్జున, మోహన్ బాబు లాంటి వారి సాయం కోరాలని సూచించారు తమ్మారెడ్డి.

Post a Comment

1Comments

  1. సినిమా టికెట్ ధర నిర్ణయించేటప్పుడు ఇది చిన్నసినిమా, ఇది పెద్దసినిమా అని ఎలా వర్గీకరిస్తారు?

    ReplyDelete
Post a Comment