సిపిఎం ఏ పి రాష్ట్ర కార్యదర్శిగా వి శ్రీనివాసరావు

Telugu Lo Computer
0


సిపిఎం రాష్ట్రకార్యదర్శిగా వి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. తాడేపల్లిలోని టి షడ్రక్‌, రెడ్డి శ్రీరామ్మూర్తి ప్రాంగణంలో ఈనెల 27 నుండి 29 వరకు జరిగిన సిపిఎం రాష్ట్ర 26వ మహాసభలు 13మందితో రాష్ట్రకార్యదర్శివర్గాన్ని, ఇద్దరు కార్యదర్శివర్గ ఆహ్వానితులు, 50మంది కమిటీ సభ్యులు(కార్యదర్శివర్గంతో కలిపి), ఏడుగురు ఆహ్వానితులు, ఐదుగురు ప్రత్యేక ఆహ్వానితులతో నూతన కమిటీ ఎన్నికైంది. కమిటీ సభ్యుల వివరాలు... వి శ్రీనివాసరావు(రాష్ట్రకార్యదర్శి) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఎంఎ గఫూర్‌, వై వెంకటేశ్వరరావు, సిహెచ్‌ నర్శింగరావు, సిహెచ్‌ బాబూరావు, కె ప్రభాకరరెడ్డి, డి రమాదేవి, మంతెన సీతారాం, బి తులసీదాస్‌, వి వెంకటేశ్వర్లు, పి జమలయ్య, కె లోకనాదం, మూలం రమేష్‌ ఎన్నికయ్యారు. కార్యదర్శివర్గ ఆహ్వానితులుగా కిల్లో సురేంద్ర, కె సుబ్బరావమ్మ ఎన్నికయ్యారు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా వి కృష్ణయ్య, వి ఉమామహేశ్వరరావు, దడాల సుబ్బారావు, జె జయరాం, పి మురళీకృష్ణ, బి ప్రభావతి, కె ఎస్‌ లక్ష్మణరావు, వై అచ్యుతరావు, ప్రసాద్‌, కె స్వరూపరాణి, కె ధనలక్ష్మి, ఎవి నాగేశ్వరరావు, ఎం బాలకాశి, అండ్ర మాల్యాద్రి, ఎం సూర్యారావు, కె హరికిషోర్‌, జె ప్రభాకర్‌, ఎన్‌ యాదగిరి(నెల్లూరు), డివి కృష్ణ(కృష్ణా పశ్చిమ), డి కాశీనాథ్‌(కృష్ణా పశ్చిమ), కె శ్రీదేవి(కృష్ణా పశ్చిమ), గౌస్‌దేశారు(కర్నూలు), నిర్మల(కర్నూలు), బి బలరాం(ప.గో.డెల్టా), చింతకాయల బాబూరావు(ప.గో.అప్‌ల్యాండ్‌), వి రాం భూపాల్‌(అనంతపురం ఉత్తరం), పూనాటి ఆంజనేయులు(ప్రకాశం తూర్పు), పాశం రామారావు(గుంటూరు తూర్పు), వై నరసింహారావు(కృష్ణా తూర్పు), ఎం జగ్గునాయుడు(విశాఖ అర్బన్‌), టి అరుణ్‌(తూ.గో. రాజమండ్రి), టి రమేష్‌కుమార్‌(నంద్యాల), రెడ్డి వేణు(పార్వతీపురం), జి విజరుకుమార్‌(గుంటూరు పశ్చిమ), సయ్యద్‌ హనీఫ్‌(ప్రకాశం పశ్చిమ) ఎన్నికయ్యారు. ఆహ్వానితులుగా కె ఉమామహేశ్వరరావు(రాష్ట్రకేంద్రం), ఎ అశోక్‌(రాష్ట్రకేంద్రం), ఎన్‌ భాస్కరయ్య(వృత్తిదారులు), కిరణ్‌(తూ.గో.రాజమండ్రి), వి సావిత్రి(అనంతపురం ఉత్తరం), జి చంద్రశేఖర్‌(కడప), వి నాగరాజు(తిరుపతి) ఎన్నికయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పెనుమల్లి మధు, పాటూరు రామయ్య, బిఆర్‌ తులసీరావు, వి బాలసుబ్రహ్మణ్యం, వై సిద్దయ్య ఎన్నికయ్యారు. కంట్రోల్‌ కమిషన్‌ అధ్యక్షులుగా జాలా అంజయ్య, సభ్యులుగా జి రాజేశ్వరరావు, లక్ష్మి, జి ఓబులు, కుంజా సీతారామయ్య ఎన్నికయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)