ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి ఇంటింటి సర్వే

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో విజయనగరం జిల్లాలో తొలి కేసు వెలుగు చూసింది.ఒమిక్రాన్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఇంటింటి సర్వేను చేపట్టనుంది.  సోమవారం నుండి డోర్ టు డోర్ ఫీవర్ సర్వే నిర్వహిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో ఈ సర్వే మొదలవుతుంది. ఈ మేరకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సర్కులర్‌ను జారీ చేశారు. జ్వరంతో బాధపడుతున్న వారికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేసింది.  కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత 33 సార్లు ఈ తరహా సర్వేను చేపట్టింది. జ్వర పీడితులను సకాలంలో గుర్తించడం ద్వారా కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందకుండా నివారంచడానికి వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)