సంస్థల్ని అమ్మమన్నాం కానీ, భూముల్నికాదు !

Telugu Lo Computer
0


కేంద్ర ప్రభుత్వం మానిటైజేషన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేయడానికి ప్రణాళికలు సిద్దం చేసింది. రాష్ట్రాలు కూడా అమ్మేయడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇలాంటి అవకాశాలను ఎలా అయినా వాడుకునే ఆంధ్రప్రదేశ్ ప్రభుతవం వెంటనే భూముల్ని అమ్ముతున్నాం. కానీ కోర్టులో కేసులు పడ్డాయి.. మీరు కూడా వచ్చి ఇంప్లీడ్ అయితే కోర్టు సానుకూల నిర్ణయం చెబుతుంది అని, నీతిఅయోగ్‌కు లేఖ రాసింది. అయితే నీతి అయోగ్ నుంచి రిప్లయ్ మాత్రం ఊహించని విధంగా వచ్చింది. తాము ప్రభుత్వ సంస్థలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి చెప్పాం కానీ భూముల గురించి కాదని. అంటే సృష్టించిన ఆస్తులను అమ్మమన్నాం కానీ భూములను కాదని స్పష్టం చేసింది. భూముల అమ్మకానికి తాము వ్యతిరేకమని . హైకోర్టులో జరుగుతున్న భూముల అమ్మకం కేసుల్లో తాము ఇంబ్లీడ్ కాలేమని స్పష్టం చేసింది. అమ్మేసుకోవచ్చు అని కేంద్రం చెబితే.. ఏదైనా అమ్ముకోవచ్చన్న తాపత్రయంలో ఏపీ సర్కార్ ఉందన్న విమర్శలు సహజంగానే వస్తున్నాయి. మార్కెట్లు, క్వార్టర్స్ ఇలా దేన్నైనా అడ్డగోలుగా అమ్మేందుకు మిషన్ బిల్డ్ ఏపీని ప్రారంభించారు. కానీ అలాంటి ఆస్తులను అమ్మడం.. ఆవి దాతలిచ్చిన భూములు కావడంతో వాటిని అమ్మడం చట్ట వ్యతిరేకమని కోర్టుకు వెళ్లడంతో ఎక్కడివక్కడ ఆగిపోయాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)