ఇల్లు దోచుకెళ్లిన మాయలాడి!

Telugu Lo Computer
0


40ఏళ్ల బ్రహ్మచారి ఓమిత్రుడి సాయంతో పెళ్లిళ్ల బ్రోకర్‌ను కలిశాడు. తనకు రూ.లక్ష ఇస్తే సంబంధం ఖాయం చేస్తానని అతను చెప్పడంతో బ్రహ్మచారి ఆ మొత్తాన్ని చెల్లించాడు. ముందూ వెనుక ఎవరూ లేని ఓ అమ్మాయి ఉందని తనతో పాటు విజయవాడకు వస్తే ఆమెను పెళ్లికి ఒప్పిస్తానన్నాడు. మిత్రుడితో కలిసి బ్రోకర్‌ వెంట వెళ్లిన బ్రహ్మచారి అక్కడే అమ్మాయిని చూసి ఓ లాడ్జిలో గురువారం పెళ్లి చేసుకున్నాడు. భార్యతో యాదగిరిగుట్టకు వచ్చి వ్రతం చేసుకున్నాడు. హైదరాబాద్‌కు వచ్చి షాపింగ్‌ చేశారు. మూడు తులాల బంగారు గొలుసు, రూ.40వేల దుస్తులు కొనుగోలు చేసి శుక్రవారం రాత్రి 8.30కి స్వగ్రామం చేరుకున్నారు. ఇంట్లో కొద్దిసేపే ఉన్న కొత్త పెళ్లికూతురు బీరువాలో బట్టలు సర్దుతున్నట్లు నటించి అందులోని రూ.రెండు లక్షలు, కొత్త దుస్తులను తన బ్యాగులోకి మార్చుకుంది. ఆమెతో పాటు వచ్చిన మరో యువతి హైదరాబాద్‌లోని తన సోదరుడిని అర్జంట్‌గా కలవాల్సి ఉందని చెప్ప స్థానికంగా ఓ కారును అద్దెకు మాట్లాడి ఉంచింది. ఈలోపు తలనొప్పి వస్తోందని మాత్రలు తెమ్మని పెళ్లి కూతురు భర్తని మందుల దుకాణానికి పంపింది. అతను అటు వెళ్లగానే వారిద్దరు కారులో వెళ్లిపోయారు. నగరం శివారు ఇంజాపూర్‌ సమీపంలోకి రాగానే ఇద్దరి వాలకం చూసి కారు డ్రైవర్‌ అవాక్కయ్యాడు. కారులోనే వారు దుస్తులు మార్చుకోవడం చూసి ఇదేంటని ప్రశ్నించగా అతన్ని బెదిరించారు. ఎల్బీనగర్‌ వద్ద కారు దిగి విజయవాడకు వెళ్లిపోయారు. బాధిత పెళ్లికొడుకు సోమవారం ఈ విషయం స్థానిక పెద్దలకు చెప్పుకోవడంతో విషయం బయటకు వచ్చింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)