రెక్కీ నిర్వహించారనడంలో నిజం లేదు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 28 December 2021

రెక్కీ నిర్వహించారనడంలో నిజం లేదు


తన తండ్రి అధిక రక్తపోటు కారణంగానే ఆసుపత్రిలో చేరారని వైకాపా ఫ్లోర్‌ లీడర్‌ వెంకట సత్యనారాయణ కుమారుడు చరణ్‌ తేజ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణపై రెక్కీ చేశారంటూ వెంకట సత్యనారాయణపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సూర్యారావుపేటలోని ఆసుపత్రి వద్ద చరణ్‌ తేజ మీడియాతో మాట్లాడారు. సోమవారం మధ్యాహ్నం ఒక కార్యక్రమానికి వెళ్లొచ్చిన తన తండ్రి అస్వస్థతకు గురి కావటంతో చికిత్స నిమిత్తం ఆంధ్రా ఆసుపత్రి హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ ఇన్‌స్టిట్యూటులో చేర్పించామని తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, 48 గంటల పాటు పరిశీలనలో ఉండాలని వైద్యులు చెప్పారన్నారు. వంగవీటి రాధాకృష్ణపై రెక్కీ చేశారనే దాంట్లో నిజం లేదని స్పష్టం చేశారు. తన తండ్రి ఇంటి వద్ద నుంచే అంబులెన్స్‌లో నేరుగా ఆసుపత్రికి వచ్చారని, ఆయన్ని పోలీసులు కస్టడీలో తీసుకున్నారన్న మాట అబద్ధమని తెలిపారు. మాకు ఎవరితోనూ గొడవలు లేవని, కొంత మంది రాజకీయంగా ఆటలాడుతున్నారని, తన తండ్రి కోలుకుని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతారని చరణ్‌తేజ వివరించారు. 

No comments:

Post a Comment