"పుష్ప" ఫస్ట్ రివ్యూ వచ్చేసింది

Telugu Lo Computer
0


అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల కానుంది. ఈ చిత్రం అల్లు అర్జున్ కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాగా, తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చింది. యూఏఈ ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్‌లో సభ్యుడిగా ఉన్న ఉమైర్ సంధు ఈ చిత్రాన్ని చూసిన అనుభవాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. సినిమా ఫస్ట్ రివ్యూని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సెన్సార్ బోర్డ్‌లో సినిమా ప్రదర్శన పూర్తయిందని, 'పుష్ప మొదటి సగం రేసీ టెర్రిఫిక్. అల్లు అర్జున్, రష్మిక కెమిస్ట్రీ ఎలెక్ట్రిఫయింగ్. వాట్ ఎ పెర్ఫార్మెన్స్. ఆమె అద్భుతంగా ఉంది. పవర్ ప్యాక్డ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సుకుమార్ డైరెక్షన్ అద్భుతం. టాలీవుడ్‌లో ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో 'పుష్ప' ఒకటి. అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ & నేషనల్ అవార్డ్ వర్తీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన అన్ని విధాలుగా సినిమాను ప్రత్యేకంగా నిలిచారు' అంటూ సినిమాకు రేటింగ్ 4/5 కూడా ఇచ్చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)