చెప్పులు లేకుండా నడిస్తే కలిగే ప్రయోజనాలు!

Telugu Lo Computer
0


చెప్పులు లేకుండా వట్టి కాళ్లతో క్లీన్ గా ఉన్న నేల మీద, లేదా గడ్డి మీద నడవడం. ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. చెప్పులు లేకుండా నడవటం వలన పాదాల్లో ఉన్న ఆక్యుప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి, దీని వలన శరీరం మొత్తానికీ హెల్ప్ చేస్తుంది. భూమి మీద నివసించే ప్రాణులన్నీ కూడా నేలతో సంబంధం కలిగి ఉంటాయి.ఇంటిలో కూడా  నడిచినప్పుడు చెప్పులు లేదా షూస్ వేసుకుని నడుస్తాం. దాంతో నేల తల్లి చల్లని స్పర్శని మనం మిస్ అవుతున్నాం. అందుకే మనలో చాలా మంది అంత ఆనందంగా అయితే జీవించడం లేదు. ఇవాళ ఇదే విషయాన్ని ఎన్నో సైంటిఫిక్ స్టడీస్ ప్రూవ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న రకరకాల అనారోగ్యాలకి గల కారణాలో మనిషి ప్రకృతి నుంచి విడివడి బతకడమే కారణం అని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి. ఇలా నేల స్పర్శని అనుభవించడాన్ని గ్రౌండింగ్ అంటారు.  గ్రౌండింగ్ వల్ల ఎంతో రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. ప్రకృతితో మమేకమయినట్లుగా అనిపిస్తుంది. మైండ్ ఫుల్‌గా చేస్తే చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది. నేలతల్లి స్పర్శని అనుభవించడానికి గ్రౌండింగ్ మంచి అవకాశాన్నిస్తుంది. ఇది సిమెంట్ లేదా టైల్స్ వేసిన నేల మీద నడవడం వల్ల రాదు. గ్రౌండింగ్ వలన శారీరకంగా మానసికంగా అలెర్ట్‌గా తయారవుతాం. చుట్టుపక్కల పరిసరాల గురించి ఒక అవగాహన వస్తుంది. దీని వలన రిలాక్స్ అనిపిస్తుంది. మనసుకి శాంతిగా ఉంటుంది. ఏదో రక్షణ లభించినట్లుగా తోస్తుంది. ఇవన్నీ కలిసి బ్లడ్ ప్రెజర్ మీద పాజిటివ్ ఎఫెక్ట్ ని చూపిస్తాయి. బ్లడ్ ప్రెజర్ ని నార్మలైజ్ చేయడానికి నాచురోపతీ లో పది నుండి పదిహేను నిమిషాలు చెప్పులు లేకుండా నడవమని చెప్తారు. గ్రౌండింగ్ ఇన్‌ఫ్లమేషన్నీ నొప్పినీ తగ్గిస్తుంది. భూమికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది, చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఆ శక్తి వల్ల నడిచేవారికి కూడా ఒక ఫోర్స్ వస్తుంది. ఈ ఫోర్స్ వల్ల నొప్పి తగ్గుతుంది. గ్రౌండింగ్ వలన ఇమ్యూనిటీ నాచురల్ గా పెరుగుతుంది. భూమిలో ఉండే మైక్రోబ్స్ స్కిన్ ద్వారా లోపలికి వెళ్ళి మంచి బ్యాక్టీరియాని పెంచి ఇమ్యూన్ సిస్టమ్ ని బలంగా చేస్తాయి. మన వాడుతున్న కెమికల్స్ తో నిండి ఉన్న యాంటీ మైక్రోబియల్ సోప్స్, హ్యాండ్ వాషెస్, షాంపూ ల వంటివి కొన్ని అవసరమైన మైక్రోబ్స్ ని కూడా తీసేస్తాయి. గ్రౌండింగ్ వలన మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. స్కిన్ మీద వేలాది బ్యాక్టీరియాలుంటాయి. చెడు బ్యాక్టీరియా ఎక్కువైనప్పుడు వాసన వస్తుంది. మట్టి ఈ చెడు వాసననీ, చెడు వాసన కలిగించే బ్యాక్టీరియానీ కూడా తొలగిస్తుంది. అలాగే, గ్రౌండింగ్ వలన పాదాల వద్ద ఉండే చెడు బ్యాక్టీరియా కూడా పోతుంది. పాదాల శుభ్రత కూడా పెరుగుతుంది. ఎప్పుడూ షూస్ వేసుకుని ఉంటే ఇది సాధ్యపడదు. అయితే, చెప్పులు లేకుండా నడవడం వలన జలుబు, దగ్గు వస్తాయనే ఒక అపోహ ఉంది. ఇది నిజం కాదు. జలుబు, దగ్గు రావటం, రాకపోవటం అనేది మీ ఇమ్యూనిటీ మీద ఆధారపడి ఉంది కానీ చెప్పులు లేకుండా నడవడం మీద కాదు. మీకు ఇలా చేయటానికి అవకాశం ఉంటే మాత్రం గ్రౌండింగ్ చేయటం ఎంతో మంచిది. అయితే షుగర్ పేషెంట్స్ మాత్రం ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చెప్పులు లేకుండా నడవడం వలన వీరికి ఏదైనా దెబ్బ తగిలినా, కోసుకున్నా ఇతర కాంప్లికేషన్స్ కి దారి తీసే అవకాశం ఉంది.


Post a Comment

0Comments

Post a Comment (0)