కోర్టులకు వెళ్లి అడ్డుకోవడమే చంద్రబాబుకు తెలుసు...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 19 November 2021

కోర్టులకు వెళ్లి అడ్డుకోవడమే చంద్రబాబుకు తెలుసు...!


చంద్రబాబు గురించి మాట్లాడాలంటే ఏడాది శాసనసభ సమావేశం పెట్టినా సరిపోదని మంత్రి కన్నబాబు అన్నారు. వ్యవసాయరంగంపై మంత్రి కన్నబాబు అసెంబ్లీలో మాట్లాడారు. చంద్రబాబు అన్ని పార్టీలనూ కౌగిలించుకున్నారన్నారు. చంద్రబాబుకు ప్రతిదీ రాజకీయమేనని, ఆయనకు తెలిసింది ఒక్కటేనని, న్యాయస్థానాలకు వెళ్లి అడ్డుకోవడమేనని కన్నబాబు ఎద్దేవా చేశారు.  ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయరంగంలో అమలవుతున్న సంస్కరణలను ఇతర రాష్ట్రాలు కూడా ప్రశంసించాయన్నారు. చంద్రబాబుకు ప్రతిరోజూ రాజకీయమే కావాలని, ప్రజల బాధ పట్టదని కన్నబాబు తెలిపారు. తిరుపతికి వచ్చిన అమిత్ షాపై రాళ్లు వేయించిన చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేశారన్నారు. మంగళగిరి లోనూ లోకేష్ ఓటమిని తట్టుకున్న గుండె చంద్రబాబుది అని, కుప్పం ఓటమి ఆయనకు లెక్క కాదని కన్నబాబు తెలిపారు. జగన్ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే కాకుండా, రైతుల ప్రయోజనాలను కాపాడుతుందన్నారు.

No comments:

Post a Comment