మన హీరోలు - పారితోషికం !

Telugu Lo Computer
0


తెలుగు సినిమా హీరోలకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. కొందరు స్టార్ హీరోల సినిమాలు పాన్ ఇండియా లెవల్లో చిత్రీకరిస్తారు. ఎందుకంటే ఇతర భాష ల్లోకి వెళ్లినా వారి నటనతో అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. దీంతో వారి రెమ్యూనరేషన్ కూడా ఆ స్థాయిలో ఉంటుంది. టాలీవుడ్ హీరోలు ఒక్కో సినిమాకు కోట్ల రూపాయలను తీసుకుంటారు. అయితే వారి సినిమాలు, ప్రేక్షకుల్లో ఉండే ఆదరణను భట్టి వారి పారితోషికం అందిస్తున్నట్లు తెలుస్తోంది. 

పవన్ కల్యాణ్: మూడేళ్ల గ్యాప్ తరువాత పవన్ రీ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన రెమ్యూరేషన్లోనూ మార్పులు వచ్చినట్లు సమాచారం. అయితే రాజకీయ అవసరాల ప్రజాపోరాటాల ఖర్చుల కోసమే సినిమా చేయాల్సి వస్తుందని పవన్ ఓ సందర్భంలో చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక్కో సినిమాకు రూ.50 కోట్లకు పైగానే తీసుకుంటున్నట్లు సమాచారం.

ప్రభాస్: జక్కన్న బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఆయన సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే అవుతున్నాయి. దీంతో ప్రభాస్ రెమ్యూనరేషన్ ప్ర్యత్యేకంగా ఇంత అని కాకపోయినా సినిమా బడ్జెట్ లో 50 శాతం ఉంటుందని అనుకుంటారు. ఉదాహరణకు సినిమా బడ్జెట్ రూ.200కోట్లయితే ప్రభాస్ కు పారితోషికం రూ.100 కోట్ల అవుతుందన్నమాట.

రామ్ చరణ్: మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఖాతాలో ఎన్నో సక్సెస్ సినిమాలు ఉన్నాయి. దీంతో ఆయన స్టార్ హీరోగా సొంత ఇమేజ్ తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక్కో సినిమాకు రూ. 45 నుంచి 50 కోట్ల వరకు తీసుకుంటాడని తెలుస్తోంది. శంకర్ డైరెక్షన్లో వస్తున్న సినిమాకు రూ. 60 కోట్లు కేటీయించినట్లు సమాచారం.

జూనియర్ ఎన్టీఆర్: తీరిక లేకుండా వరుసగా సినిమాలు తీస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు రూ.45 కోట్లు తీసుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి: మెగాస్టార్ సినిమా అంటే ఎవరికైన్నా క్రేజీగానే ఉంటుంది. దీంతో ఆయన రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఆయన ఒక్కో సినిమాకు రూ. 30 నుంచి 40 కోట్ల వరకు తీసుకుంటారని సమాచారం.

అల్లు అర్జున్: లేటెస్ట్ సమాచారం ప్రకారం పుష్ఫ రెండు భాగాలకు రూ. 60 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

బాలకృష్ణ: బాలయ్య బాబు ‘అఖండ’ కోసం రూ. 11 కోట్లు తీసుకున్నారు.

విజయ్ దేవరకొండ: లైగర్ సినిమా కోసం ఈ యంగ్ హీరో రూ.10 కోట్లు తీసుకున్నాడట. అలాగే నాగార్జున, వెంకటేశ్ లు ఒక్కో సినిమాకు రూ. 7 కోట్లు తీసుకుంటారని తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)