ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దుపై యూ టర్న్?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. గతంలో శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ మరో కొత్త తీర్మానాన్ని తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం అసెంబ్లీలో దీనికి సంబంధించిన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనంతరం మండలి రద్దు ఉపసంహరణ తీర్మానం కాపీని కేంద్రానికి పంపేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.  గతేడాది జనవరిలో శాసన మండలిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏపీలోని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, మూడు రాజధానుల బిల్లులను శాసనమండలి వ్యతిరేకించింది. ఆ సయమంలో టీడీపీకి మండలిలో బలం ఎక్కువగా ఉండటంతో ఇలా జరిగింది. ఈ నేపథ్యంలో 151 స్థానాల్లో ప్రజాబలంతో గెలిచి.. అసెంబ్లీ శాసనసభ తీసుకున్న నిర్ణయమే ఫైనల్‌ అని సీఎం జగన్‌ ఆగ్రహించారు. ఈ సందర్భంగా టీడీపీపై ఫైర్ అయ్యారు. దీంతో మండలి నిర్వహణకు రూ.లక్షల్లో భారం మోయాల్సి వస్తోందని.. అందుకే మండలిని రద్దుచేయాలని కేంద్రాన్ని కోరుతూ గత ఏడాది జనవరి 27న శాసనసభలో తీర్మానం పెట్టారు. అనంతరం తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపారు. అయితే, ప్రస్తుతం మండలిలో బలాబలాలు చూస్తే వైసీపీకి ఆధిక్యం వచ్చింది. అందుకే జగన్ సర్కార్ వెనక్కు తగ్గిందనే చర్చ జరుగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)