జ్యోతిలక్ష్మి

Telugu Lo Computer
0


జ్యోతిలక్ష్మి దక్షిణ భారత శృంగార నృత్య నటి. ఈమె జయమాలినికి అక్క. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వెయ్యికి పైగా పాటల్లో నర్తించింది. వీటిలో హీరోయిన్ గా చేసిన సినిమాలు ఒక ఇరవై దాకా ఉంటాయి. తమిళంలో పది సినిమాలలో కథానాయకిగా నటించింది. జ్యోతిలక్ష్మి తమిళ అయ్యంగార్ల కుటుంబంలో1948లో జన్మించింది. ఆమె తండ్రి పేరు టి.కె. రామరాజన్, తల్లి పేరు శాంతవి. ఎనిమిది మంది తోబుట్టువుల్లో జ్యోతిలక్ష్మి అందరికంటే పెద్దదైతే, జయమాలిని అందరికంటే చిన్నది. ఎనిమిది మందిలో ఐదుగురు ఆడపిల్లలు. ఈమె కెమెరామెన్ సాయిప్రసాద్‌ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఈమెకు జ్యోతిమీనా అనే ఒక కూతురు ఉంది. జ్యోతిమీనా కూడా సినిమాలలో నటించింది కాని నిలదొక్కుకోలేకపోయింది. ఈమె చిన్నతనం నుండి ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి వద్ద పెరిగింది. ధనలక్ష్మి అప్పటికే ప్రసిద్ధ నటి. జ్యోతిలక్ష్మికి ఐదేళ్ళ వయసులో ఉన్నప్పుడు ఆమె అన్న వరస అయిన దర్శక నిర్మాత టి.ఆర్.రామన్న (పెద్దమ్మ కొడుకు) ఒక ఎం.జీ.ఆర్ సినిమాలో జ్యోతిలక్ష్మిచే నాట్యం చేయించాడు. ఎనిమిదేళ్ళ వయసులో శివాజీ గణేశన్ చిత్రం కార్తవరాయన్ కథలో డ్యాన్స్ చేసింది. ఆ తరువాత పెద్దయ్యాక 1963లో విడుదలైన ఎం.జీ.ఆర్ చిత్రం పెరియ ఇడత్తు పెణ్ తో చిత్రం రంగంలో ప్రవేశించింది. ఈ చిత్రంలో నగేష్ సరసన వల్లి అనే హాస్యపాత్రలో నటించింది. ఈమె చిన్నతనంలో రామయ్య పిళ్ళై వద్ద భరతనాట్యం నేర్చుకుంది. ఈ నాట్యశిక్షణ సినిమాలో నాట్యాలు చేయటానికి సహకరించింది. తెలుగులో జ్యోతిలక్ష్మి తొలి చిత్రం 1967లో విడుదలైన పెద్దక్కయ్య.1973లో శోభన్ బాబు హీరోగా వచ్చిన ఇదాలోకం సినిమాలో గుడి ఎనక నా సామి గుర్రమెక్కి కూకున్నాడు అన్న పాటతో ఆంధ్రదేశపు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన జ్యోతిలక్ష్మి తిరిగి అదే పాటకు కుబేరులు సినిమాలో నర్తించింది. ఇండస్ట్రీలో ఓ నయా ట్రెండ్ కు తెరలేపింది జ్యోతిలక్ష్మి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడు వందల సినిమాలకు పైగా నటించిన జ్యోతిలక్ష్మి.. వెయ్యికి పైగా పాటల్లో డ్యాన్స్ చేసింది. దాదాపు 30 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. 1948లో తమిళ అయ్యంగార్ల కుటుంబంలో పుట్టింది. తెలుగులో ఆమె మొదటి సినిమా ‘పెద్దక్కయ్య’ 1967లో విడుదలైంది. 80, 90 లలో తన డ్యాన్సులతో కుర్రకారు మతిపోగొట్టారు జ్యోతిలక్ష్మి. క్లబ్ డాన్సులకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఎంత పెద్ద హీరో అయినా ఆ మూవీలో జ్యోతిలక్ష్మి ఐటమ్ సాంగ్ ఉందంటే జనం క్యూకట్టేవారు. జ్యోతిలక్ష్మి డ్యాన్స్ చూసేందుకే సినిమాలకు వచ్చేవారు. కొద్దికాలంగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న జ్యోతిలక్ష్మి ఆరోగ్యం విషమించడంతో 2016, ఆగష్టు 9 న తెల్లవారు ఝామున చెన్నైలోని ఆమె నివాసంలో చనిపోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)