పవన్ కళ్యాణ్ ను అభినందించిన కొడాలి నాని

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అభినందించారు. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్ లోని నివాసంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నేపథ్యంలో ఉద్యమం చేయడానికి పవన్ కళ్యాణ్ ముందుకు రావడం పట్ల ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని నాని అన్నారు. అలాగే పవన్ ఫై పలు కౌంటర్ లు వేశారు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు భయపడే వ్యక్తులు, శక్తులు ఎవరూ లేరని అన్నారు. చనిపోయిన పార్టీ జనసేన మాకు డెడ్ లైన్లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్ళి నరేంద్రమోడీకి డెడ్ లైన్లు పెట్టమనండంటూ సలహా ఇచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వారం రోజుల్లో ఆపకపోతే ఏదో ఒకటి చేస్తానంటూ గతంలో నటించిన జానీ వంటి పాత సినిమాలను వాళ్ళకు చూపించాలన్నారు. వాటిని చూసి నరేంద్రమోడీ భయపడతారేమో చూడాలన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)