స్పీకర్ పదవికి తమ్మినేని అనర్హుడు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 20 November 2021

స్పీకర్ పదవికి తమ్మినేని అనర్హుడు

 

ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వ్యక్తిగత దూషణలు జరగడం బాధాకరమని అన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి..పదవులు శాశ్వతం కాదని..హుందాగా రాజకీయాలు ఉండాలని తెలిపారు. గతంలో టిడిపి అధినేత చంద్రబాబుపై వైఎస్ మాట జారినప్పుడు విచారం వ్యక్తం చేశారని గుర్తుచేశారు. ఆ మాటలు వెనక్కి తీసుకున్నట్లు వైఎస్‌ ప్రకటించారన్నారు. చంద్రబాబు హయాంలో ఇలాంటి వ్యక్తిగత దూషణలు చూడలేదన్నారు. దేశ రాజకీయాల్లో కీలక చంద్రబాబు పాత్ర పోషించారని చెప్పారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే రోజా మాట్లాడిన విధానం తప్పు. ప్రజలు ఆమోదించరు. భువనేశ్వరిని దూషించిన మాటలే.. జగన్, కొడాలి నాని, రోజాను అంటే ఎలా ఉంటుంది. చోద్యం చూసిన తమ్మినేని సీతారాం.. స్పీకర్ పదవికి అనర్హుడు. మంత్రులు కొడాలి నాని, అనిల్ దంగల్‌లో దిగినట్లు ప్రవర్తిస్తున్నారు. అసెంబ్లీ ఘటనపై తప్పు జరిగిందని జగన్‌ వివరణ ఇవ్వాలి. ఇలాంటి సంప్రదాయాలకు జగన్ ఫుల్‌స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశారు.


No comments:

Post a Comment