పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరు కొత్త పార్టీ ప్రకటన - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 2 November 2021

పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరు కొత్త పార్టీ ప్రకటన


పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి మరీందర్ సింగ్ 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' పేరుతో త్వరలో కొత్త పార్టీ పెట్టనున్నట్టు మంగళవారం ప్రకటించారు.  ప్రస్తుతం పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేశామని, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావాల్సి ఉన్నదని వెల్లడించారు. పార్టీకి సంబంధించిన 'గుర్తు' గురించి ఇంకా ఏమీ అనుకోలేదని, త్వరలోనే ప్రకటిస్తామని ట్విట్టర్ వేదికగా తెలిపారు. కొత్త పార్టీ పేరును ప్రకటించడానికి ముందే ఏడు పేజీలతో కూడిన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపించినట్టు మరీందర్ సింగ్ వెల్లడించారు. కాగా, పంజాబ్ కాంగ్రెస్‌లో ప్రస్తుత పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్దూ మరియు అమరిందర్ సింగ్‌కు మధ్య కోల్డ్ వార్ నడవడంతో అధిష్టానం అమరిందర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. దీంతో మనస్తాపం చెందిన ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు.


No comments:

Post a Comment