తండ్రీకొడుకులను కాపాడి....! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 20 November 2021

తండ్రీకొడుకులను కాపాడి....!ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాలకు వరదలు సంభవించడంతో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ కూడా రంగంలోకి దిగింది. జిల్లాలోని దామరమడుగు వద్ద తండ్రీకొడుకులను రక్షించిన శ్రీనివాసరావు అనే ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్, ఆపై ప్రమాదవశాత్తు మృతి చెందారు. వరదలో చిక్కుకున్న తండ్రీకొడుకులను కాపాడిన శ్రీనివాసరావు తాను నీటిలో మునిగిపోయారు. ఆయన లైఫ్ జాకెట్ జారిపోవడంతో వరద ఉద్ధృతికి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. తమ ప్రాణాలను కాపాడిన ఆ కానిస్టేబుల్ తన ప్రాణాన్ని కోల్పోవడం ఆ తండ్రీకొడుకులను కలచివేసింది. వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు భౌతికకాయానికి జిల్లా ఎస్పీ విజయరావు ఘననివాళి అర్పించారు.

No comments:

Post a Comment