తెలంగాణలో అసెంబ్లీలో అడుగు పెట్టనున్న ఆర్ఆర్ఆర్

Telugu Lo Computer
0

 



టాలీవుడ్ లో మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ కి ఉన్న క్రేజ్ ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా రిలీజ్ కోసం యావత్ సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ కి ఉన్న క్రేజ్ రాజకీయ నాయకులకు కూడా చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఆర్ఆర్ఆర్ అంటే… వెంటనేవైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గుర్తుకొస్తారన్న సంగతి తెలిసిందే,, ఇపుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా ఆర్ఆర్ఆర్ సందడి చేస్తుంది. తెలంగాణ బీజేపీకి సంబంధించిన ఆర్ఆర్ఆర్ పోస్టర్ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేగా గతంలో రాజాసింగ్ ప్రాతినిధ్యం వహించేవారు. తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు గెలిచారు. వీరిద్దరూ అసెంబ్లీకి కమలం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తుండగా.. తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల గెలవడంతో ఈ సంఖ్య రెండు నుంచి మూడుకు చేరుకుంది. టిఆర్ఎస్ కు గుడ్ బై  చెప్పిన ఈటెల బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం బై ఎలక్షన్ కు వెళ్లారు. తన హవాని కొనసాగిస్తూ.. ఈటెల రాజేంద్ర విజయం సొంతం చేసుకున్నారు. దీంతో బీజేపీ తరఫున మూడో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఆయన అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తెలంగాణ పొలిటికల్ లీడర్స్ ఆర్ఆర్ఆర్ అంటూ ఓ ఫోటో వైరల్ అవుతుంది. ఇక ఎన్నికల ప్రచారం లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాజేంద్ర గెలుస్తారు. అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పిన విషయం గుర్తు చేసుకుంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)