వెయ్యి కోట్లు సాయం అందించండి !

Telugu Lo Computer
0


బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డాయి. భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. తమను వెంటనే ఆదుకోవాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి జగన్‌ కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు వేర్వేరుగా లేఖలు రాశారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రాష్ట్రానికి తక్షణమే రూ.వెయ్యికోట్ల సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రంలోని కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో అసాధారణంగా 255 శాతం మేర అధిక వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసింది. తిరుపతి, తిరుమల, మదనపల్లె, నెల్లూరు, రాజంపేట తదితర ప్రాంతాలు నీట మునిగాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్ర నష్టం వాటిల్లింది. 196 మండలాల్లో నష్టం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో 324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. నాలుగు జిల్లాల్లో రహదారులు, చెరువులు, కాల్వలు కోతకు గురయ్యాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. చాలా ప్రాంతాలు నీటమునిగాయి. తక్షణ సాయంగా రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాలని తన లేఖల్లో సీఎం జగన్‌ కోరారు. వర్షాల వల్ల బ్రిడ్జిలు కూలిపోయాయి. ట్రాన్స్ ఫార్మర్లు కొట్టుకుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,42, 862 ఎకరాల్లో పంట నష్టం కలిగింది. రహదారులు డ్యామేజ్ అవటం వల్ల జరిగిన నష్టం రూ.1756 కోట్లు. పట్టణాభివృద్ధి శాఖలో నష్ట అంచనా రూ.1252 కోట్లు. డ్యాములు, సాగునీటి శాఖకు జరిగిన నష్టం అంచనా రూ,556 కోట్లు. వర్షాల వల్ల మొత్తం నష్ట అంచనా రూ. 6,054 కోట్లు అని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)