ఆస్తి పన్ను పోటు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఆస్తి మూలధన విలువ ఆధారంగా విధించే పన్ను అమలులోకి వచ్చింది. ఇందుకోసం పట్టణ స్థానిక సంస్థలు ఇప్పటికే నోటీసులు జారీచేయడం మొదలు పెట్టాయి. జీవో 198 ప్రకారం మూలధన విలువపై విధించే పన్నుతో సమానం అయ్యే వరకూ ఏటా 15% మేర పెరిగితే భారం తప్పదన్న విషయం ప్రజలకు అర్థమవుతోంది. కొత్త విధానంలో మొత్తం పన్ను పెంపు 100-300 శాతం వరకూ ఉంది. పెంపు ఏడాదికి 15% మాత్రమే ఉండటంతో ఇప్పటికిప్పుడు భారం కనిపించదు గానీ, కొన్నాళ్ల తర్వాత తెలుస్తుంది. గుంటూరు నగరపాలక సంస్థలో పన్ను పెంచుతూ తాజాగా నోటీసులు ఇచ్చారు. మిగిలిన పట్టణ స్థానిక సంస్థల్లో కూడా నోటీసులు వస్తే గానీ, అక్కడి ప్రజలకు ఎంత భారం పడేదీ తెలియదు.

Post a Comment

0Comments

Post a Comment (0)